AP: ఏపీలోని రాయచోటిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడిని ముగ్గురు విద్యార్థులు చంపేశారు. అక్కడికొత్తపల్లె జెడ్పీ హైస్కూల్‌లో చిన్నపాటి వివాదంతో తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.