TG: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సీఐ భీమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిదూర్ వాసి సత్యనారాయణ వికారాబాద్ లోని గాంధీ కాలేజీ వద్ద అద్దెకు ఉంటున్నారు. ఆయన కూతురు జ్యోతి(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.