బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, సామ్ కొన్‌స్టాస్ 60, ఖవాజా 57, లబుషేన్ 72, కమిన్స్ 49 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, జడేజా 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీశారు.