TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. 'మా ఇంటి దగ్గర ఏం జరిగిందో మీరు అంతా చూశారు. మేం ఇప్పుడు సంయమనం పాటిస్తున్నాం. తొందరపడి ఎవరూ ఎలాంటి చర్యలకు దిగవద్దు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిపై దాడులను ఎవరూ ఎంకరేజ్ చేయవద్దు' అని అన్నారు.