దారుణం.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

66பார்த்தது
దారుణం.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
యూపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అలీగఢ్‌‌కు చెందిన ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని కలిసేందుకు శనివారం ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా.. ఇంతలో ప్రియురాలు తన బ్యాగ్‌లోంచి యాసిడ్ బాటిల్ తీసి ప్రియుడిపైకి విసిరేసింది. ఈ ఘటనలో సదరు యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసుకొని, అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி