రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో 17వ బెటాలియన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి 7వ బెటాలియన్ వద్ద పోలీసుల భార్యలు ధర్నా చేపట్టారు. ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. తమ భర్తలను లోపల కూలీ పనులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు విధులకు, వాళ్లు చేస్తున్న పనికి సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.