AP: ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన కూతురు

71பார்த்தது
AP: ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన కూతురు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు అతి దారుణంగా హత్య చేసింది. మైలవరానికి చెందిన జీవమణి అనే యువతికి నాగూర్ వలీ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇది గమనించిన జీవమణి తల్లి ఎస్తేర్ యువతిని మందలించింది. దీంతో ప్రియుడితో కలిసి జీవమణి తల్లి తలపై సిమెంట్ రాయితో కొట్టి హత్య చేశారు. పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி