ప్రముఖ నటుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఆయనను ఘనంగా సత్కరించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.