TG: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పెట్టే ఆహారం నాణ్యత లోపిస్తోంది. ఖైరతాబాద్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో తాజాగా చిన్నారులకు గుడ్లు పంపిణీ చేశారు. ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లి ఉడకబెట్టి పొట్టు తీయగా చనిపోయిన కోడి పిల్ల కనిపించింది. అది చూసి చిన్నారుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేమిటని అంగన్వాడీ టీచర్‌ను ప్రశ్నించగా తనకేం తెలియదని తనకు అందజేసిన గుడ్లను తాను సరఫరా చేసినట్లు సమాధానం చెప్పింది.