అమెరికాలో గ్రీన్‌కార్డు కలిగి ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పర్మినెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ .. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో గ్రీన్‌కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.