అలయ్ బలయ్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది: సీఎం రేవంత్

56பார்த்தது
అలయ్ బలయ్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది: సీఎం రేవంత్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరై ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని, ఒకప్పుడు రాజకీయ పార్టీల పరంగానే కార్యక్రమాలుండేవని, కానీ దత్తాత్రేయ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను ఒకే గొడుగుపైకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி