బీహార్‌లోని సీతామర్హిలో దారుణ ఘటన జరిగింది. తన స్నేహితుడి తల్లితో అఫైర్ పెట్టుకున్నాడనే ఆరోపణలతో యువకుడిని బంధువులు కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ అనే యువకుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో రీనా దేవితో స్నేహం ఏర్పడి ఎఫైర్‌కు దారితీసింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న బంధువులు దారుణంగా కొట్టారు. దీంతో అతడు మృతి చెందాడు.