కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 సంవత్సరానికిగాను 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎన్‌టీఏ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి13వ తేదీలోపు https://exams.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. 6వ తరగతి అభ్యర్థుల వయసు 2025 మార్చి 31కి 10 –12 ఏళ్లు 9వ తరగతి అభ్యర్థుల వయసు 13–15గా ఉండాలి.