కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలం సోమిని ప్రాణహిత నదిలో శనివారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జహీర్ హుస్సేన్ మృతదేహం లభ్యం కాగా సాయంత్రం ఇర్షాద్ మృతదేహాన్ని మహారాష్ట్ర రెస్క్యూ టీంతో కలిసి తెలంగాణ పోలీసులు వెలికితీశారు. ఇర్షాద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించినట్లు బెజ్జూర్ ఎస్ఐ విక్రం తెలిపారు. మరొక మృతదేహం కోసం గాలిస్తున్నామన్నారు.