తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యలను కఠినంగా శిక్షించాలని జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో ఇలాంటి ఘటనతో కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.