ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక
ముధోల్లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం డిఆర్డివో విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. 2023-24కు గాను మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 358 పనులకు గాను రూ. 3 కోట్ల 9 లక్షల పైగా ఉపాధి హామీ పనులు చేసినట్లు తెలిపారు. ఆపనులను సెప్టెంబర్ 28 నుంచి ఈ నెల 7వరకు అధికారుల బృందం సామాజిక తనిఖీ చేసినట్లు చెప్పారు.