కుంటాల మండలం ఓల శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చోరి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆలయానికి చేరుకొని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.