నూతన గ్రామపంచాయతీని ఏర్పాటు చేయాలని కోరుతూ భైంసా మండలం బాబుల్గాం గ్రామస్తులు గురువారం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం తమ గ్రామం ఎగ్గం పంచాయతీ పరిధిలో ఉందని పెన్షన్లతోపాటు ఇతర అవసరాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.