మంచిర్యాల: సైబర్ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తల అరెస్టు
తెలుగు మాట్రిమోనీ పేరిట సైబర్ నరాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన ఎర్ర వెంకట నాగరాజు, ముత్తారం మండలానికి చెందిన రామచంద్ర సౌజన్య భార్యాభర్తలు ఇద్దరిని అరెస్టు చేసినట్లు రామగుండం సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటరమణ సోమవారం తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒకరు వీరి చేతిలో చిక్కుకొని రూ. 17 లక్షల కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపామన్నారు.