TG: మూసీ ప్రక్షాళనపై ప్రజల్లో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి జిల్లాలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు, చేతులు వంకర్లు పోయి క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అందరూ కలిసి కట్టుగా పోరాడకపోతే మూసీ మురికి కుంపంగా మరింత పీడిస్తుందని.. అలా జరిగితే రాజకీయాల్లో కొనసాగడం వేస్ట్ అన్నారు.