తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులకు త్వరలోనే కమిషన్ పెంచుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అదే విధంగా మీసేవ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనిపై త్వరలోనే సీఎంకు నివేదిక అందజేస్తామని చెప్పారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో సోమవారం జరిగిన తెలంగాణ మీసేవ ఫెడరేషన్ 14వ వార్షికోత్సవాలలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.