మంచిర్యాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నారాయణ హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఎంఈవో పోచయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, కనీస అనుమతులు, వసతి సౌకర్యాలు లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని తెలిపారు. ఐఐటి, ఎన్ఈఈటి, నారాయణ యాప్ అనే పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.