హాజీపూర్ మండల శివారులో బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సాయి అనే వ్యక్తి తన బైక్లో పెట్రోల్ అయిపోవడంతో మంగళవారం రాత్రి రోడ్డుపై నిల్చున్నాడు. మంచిర్యాల వైపు నుంచి కర్ణ మామిడికి వెళ్తున్న అజయ్ తన బైక్ తో ఒక్కసారిగా ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అజయ్ ని ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.