అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మందమర్రి మార్కెట్ వెనుక భాగంలో కల్వర్టును ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలను జెసిబి సాయంతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల అక్రమాలు కూల్చడానికి వచ్చిన సిబ్బందిని సంబంధిత ఆక్రమదారులు కొంత గడువు అడిగిన పిమ్మట గడువు పూర్తి కావడంతో కూల్చివేతలను ప్రారంభించారు.