
జైపూర్: జింక మాంసం విక్రేతల అరెస్టు
జైపూర్ మండలం గంగిపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి చంపి వాటి మాంసాన్ని విక్రయించడానికి యత్నిస్తున్న ఇద్దరినీ అటవీశాఖ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పాలమకుల శ్రీనివాస్ రెడ్డి, గూడ పాపన్నలు కృష్ణ జింకను వేటాడి చంపి మాంసం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిపై అటవీశాఖ చట్టాల ప్రకారం పలు కేసులు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు తెలిపారు.