బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఉద్యోగులు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ భవనంలో అటెండర్‌గా పనిచేస్తున్న నవీన్ ఇటీవల మృతి చెందారు. నవీన్ మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కోవడంతో జేఏసీ చైర్మన్ అశోక్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా నవీన్ తండ్రి లింగన్నకు ఆర్థిక సాయం కింద రూ. 70 వేల చెక్కును సోమవారం ఆదిలాబాద్ లో అందజేశారు. టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, టీజీవో సహాయ అధ్యక్షులు శివ ఉన్నారు.