భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన కర్నేవార్ గణేష్ తాంసి సహకార సంఘంలో కార్యదర్శిగా పని చేస్తున్నాడు. శుక్రవారం బైక్ పై వెళ్తుండగా హస్నాపూర్-కోడదు గ్రామాల మధ్య అంతర్ రాష్ట్ర రహదారిపై కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతనిని అంబులెన్సులో రిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేశారు.