నాగార్జున N కన్వెన్షన్ హాల్ FTLలో ఉందని 2016లో HMDA రిపోర్ట్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఎందుకు కూల్చలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. 'ఆ సమయంలో నాగార్జున కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యా రు. అసలు ఆమెకు చేనేత గురించి ఏం తెలుసు అని, అప్పటి ప్రభుత్వానికి ఆ రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధమేంటో వారే చెప్పాలి' అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.