విటమిన్-డి లోపం ఎముకల సమస్యలకు దారితీస్తుంది. అయితే విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల వృద్ధుల్లో గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సప్లిమెంట్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ శోషణకు.. నాడీ కండరాల ఆరోగ్యం, కణాల పెరుగుదలకు సహకరిస్తాయి. రోజూ వ్యాయామం చేస్తూ, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారిలో విటమిన్-డి స్థాయిలు అధికంగా ఉండి, గుండె జబ్బులు రావని గత పరిశోధనల్లోనూ తేలింది.