గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం గురువారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు ప్రస్తుత స్థితిగతులు రికార్డుల నిర్వహణ వాటిని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా సిబ్బంది విధుల నిర్వర్తిస్తూ బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. డిఎస్పి సిహెచ్ నాగేందర్, సీఐ భీమేష్, ఎస్సై ఇమ్రాన్ ఉన్నారు.