బోథ్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. రెండు రోజుల క్రితం మండలంలోని చింతలబోరి గ్రామశివారులో అటవీ సిబ్బందికి కనిపించిన పులి.. మళ్లీ బుధవారం ఉ. 6 గంటలకు చింతలగూడ పరిసరాల్లో కనిపించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా అది అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి. అటవీ సిబ్బంది పులి జాడను కనిపెట్టే పనిలో పడ్డారు.