బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ తెలిపారు.. రసాయన శాస్త్రంలో ఖాళీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55% పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రధమ ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తులు కళాశాలలో అందించాలని సూచించారు.