ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం జల్, జంగల్, జమీన్ నినదించి హక్కుల కోసం పోరాడి అమరులైన ఆదివాసి వీరులకు రాష్ట్ర మంత్రి సీతక్క నివాళుర్పించారు. అనంతరం తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ బాపూరావు, మాజీ ఎమ్మెల్యే సక్కు, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి శ్రీనివాస్, సుగుణ, మల్లేష్ ఉన్నారు.