అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కొంతకాలంగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని జైలు అధికారులకు దర్శన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రేణుకాస్వామి ఆత్మ తన కలలోకి వచ్చి భయపెడుతోందని.. దాని వల్ల తనకు నిద్రపట్టడం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సెల్‌లో ఒంటరిగా ఉండటం, భయంతో నిద్రపోవడం లేదని అధికారులతో చర్చించారని సమాచారం.