ఉజ్జయినిలో మహిళకు మద్యం తాగించి రోడ్డుపైనే అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

54பார்த்தது
ఉజ్జయినిలో మహిళకు మద్యం తాగించి రోడ్డుపైనే అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లోకేశ్ అనే వ్యక్తి ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు అత్యాచారాన్ని అడ్డుకోకుండా వీడియోలు తీశారని వారు చెప్పారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది.

தொடர்புடைய செய்தி