TG: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో సోమవారం ఓ యువకుడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్నాడు. ఈ క్రమంలొ చుట్టుపక్కల వాళ్లు ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడిని పట్టుకొని, కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.