రొమేనియాలోని కోల్టి గ్రామంలో ఒక మహిళ తలుపులకు అడ్డుగా పెట్టుకునేందుకు కొన్నేళ్ల పాటు వాడిన వస్తువును $1.1 మిలియన్ (రూ.9.2 కోట్లు) విలువైన అంబర్ (చెట్టు స్రావం నుంచి తయారయ్యే రత్నం) ముద్దగా గుర్తించారు. సదరు మహిళకు నీటి ప్రవాహం దగ్గర 3.5 కిలోల అంబర్ దొరకగా, దాని విలువ తెలియక డోర్ స్టాపర్‌గా వాడింది. ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆ వస్తువు ఆమె బంధువు దృష్టిలో పడడంతో అసలు విలువ వెలుగులోకి వచ్చింది.