పిల్లలలో పక్షవాతంతో ముడిపడి ఉన్న ఒక శ్వాసకోశ వైరస్ అమెరికా అంతటా వ్యాపిస్తోంది. శ్వాసకోసపై దాడి చేసి పోలియో తరహాలో పక్షవాతాన్ని కలుగజేస్తోందని అక్కడి పరిశోధకులు తెలిపారు. చిన్నారుల్లో నరాల సంబంధిత సమస్యల్ని తీసుకొచ్చే ఎంటెరోవైరస్ డీ68 స్ట్రెయిన్‌ను దేశవ్యాప్తంగా మురుగునీటిలో గుర్తించినట్లు వెల్లడించారు. పిల్లల కాళ్లూచేతులు చచ్చుబడిపోతున్నాయని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని ఆవేదన వ్యక్తం చేశారు.