హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో కూడా గాలులు, మెరుపులు, ఉరుములతో జల్లులు లేదా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం సాయంత్రం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన పడింది.