దివ్యాంగుల ఉద్యోగావకాశాలకు ప్రత్యేక పోర్టల్‌

62பார்த்தது
దివ్యాంగుల ఉద్యోగావకాశాలకు ప్రత్యేక పోర్టల్‌
TG : రాష్ట్రంలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న దివ్యాంగులకు.. వారి విద్యార్హతలను బట్టి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనుంది. యూత్‌ ఫర్‌ జాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ పోర్టల్‌ను సోమవారం శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు.

தொடர்புடைய செய்தி