దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు గర్భవతిని చేశాడు. చివరికి యువతి పెళ్లి చేసుకోవాలని యువకుడిని అడిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన యువకుడు స్నేహితులతో కలిసి యువతిని చంపేసి పాతిపెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు సహా ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.