తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 311 ప్రయోగించి నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఆందోళనలకు తోటి కానిస్టేబుల్స్ ను ఉసిగొల్పారనే ఆరోపణలతో 8 బెటాలియన్ల నుండి 39 మంది కానిస్టేబుల్లపై వేటు వేశారు.