దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదించే వారి సంఖ్య గత ఐదేళ్లలో 63% పెరిగి 31,800కు చేరుకుందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2019-2024 మధ్య వీరి ఆదాయంలో 121% ఉమ్మడి వార్షిక వృద్ధి రేటు నమోదైందని పేర్కొంది. మరోవైపు రూ.5 కోట్లకు పైగా సంపాదించే భారతీయుల సంఖ్య 49% పెరిగి 58,200 మందికి చేరింది. ఏటా రూ.50 లక్షలు సంపాదించే వారి సంఖ్య 25% వృద్ధి చెంది 10 లక్షలకు పెరిగింది.