పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్‌లో శుక్రవారం నాటికి 2,200 ఇంటర్న్‌షిప్ వేకెన్సీలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న ఈ పథకం అమలుకు రూ.800 కోట్లు వ్యయం కానుంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 1.25 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ అందజేయాలన్న లక్ష్యంతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ పోర్టల్‌ను రూపొందించింది. ఆసక్తికల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.