బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి (వీడియో)

578பார்த்தது
వారం రోజుల వ్యవధిలోనే రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. తాజాగా గుజరాత్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కచ్ జిల్లా కండేరాయ్ గ్రామంలో సోమవారం ఉదయం 540 అడుగుల లోతున్న బోరు బావిలో ఇంద్రా మీనా అనే 18 ఏళ్ల యువతి పడి.. 490 అడుగుల లోతు దగ్గరలో ఇరుక్కుపోయింది. గంటల తరబడి బోరుబావిలో చిక్కుకుపోవడం వల్ల ఇంద్రా మీనా గాయాలతో ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో రెస్క్యూ సిబ్బంది 33 గంటల ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీశారు.

தொடர்புடைய செய்தி