Mar 28, 2025, 12:03 IST/
కారులో డెడ్ బాడీ.. వెంబడించి పట్టుకున్న పోలీసులు
Mar 28, 2025, 12:03 IST
నిజామాబాద్ జిల్లాలో కారులో డెడ్ బాడీ లభ్యమవడం కలకలం రేపింది. దుండుగుడు ఓ మహిళను హత్య చేసి కారు డిక్కీలో పెట్టుకొని బయలుదేరారు. ఈ క్రమంలో నగర శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కారు డ్రైవర్‌ను పట్టుకునేలోపు అతడు కారును ఆపకుండా పారిపోయాడు. వెంబడించిన పోలీసులు నిజాంసాగర్ కెనాల్ వద్ద కారును పట్టుకోగా డ్రైవర్ పరారయ్యాడు. మృతురాలు నిజామాబాద్‌కు చెందిన కమల (50)గా గుర్తించారు.