Feb 14, 2025, 12:02 IST/
కులగణనలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు: సీఎం రేవంత్ రెడ్డి
Feb 14, 2025, 12:02 IST
కులగణనలో సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్లో సీఎం మాట్లాడుతూ.. "ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. కులగణన జరిగితే చట్టం ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. అధికారిక లెక్కలుంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టుకు చెప్పవచ్చు. కానీ, కులగణన జరగకూడదని మోదీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నారు." అని ఆరోపించారు.