తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. HCU భూమి నిజంగానే ప్రభుత్వానిది అయితే దొంగలలాగ రాత్రి పూట ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి, ఫోర్త్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా, అక్కడ తీసుకో 400 ఎకరాలు. శని, ఆదివారాలు మాత్రమే పని చేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా CMకి బుద్ధి రాలేదు' అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.