తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. 50-100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని అధికారులను ఆదేశించింది.