AP: రైతులకు అండగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు వైసీపీ ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తారని తెలిపింది. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వైసీపీ వివరించింది. కాగా, ధాన్యం కొనుగోలు, రూ.20 వేల పెట్టుబడి సాయం తదితర అంశాలపై వైసీపీ పోరాడుతుందని మాజీ సీఎం జగన్ ఇటీవల ప్రకటించారు.